: బీజేపీతో కలిసి బరిలో దిగుతాం: మాంఝీ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎమ్) పార్టీ అధినేత జితన్ రామ్ మాంఝీ గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. బీజేపీ తమ మిత్ర పక్షమని అన్నారు. బీహార్ ప్రజలు ఆర్జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని స్పష్టం చేశారు. జూన్ 16న తమ పార్టీ నేతలు సమావేశమై బీజేపీకి ఎలా సాయపడాలో నిర్ణయిస్తారని మాంఝీ తెలిపారు. నితీశ్, లాలూ కూటమిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతామని అన్నారు.