: 8 వేలు చెల్లించి ఫోన్ ఆర్డర్ చేస్తే...రెండు బంగినపల్లి మామిడిపళ్లు పంపారు
ఆన్ లైన్ కొనుగోళ్లలో మోసాలు శృతిమించిపోతున్నాయి. స్టార్టప్ సేల్, వీకెండ్ సేల్, మంత్ ఎండ్ బంపర్ ఆఫర్, లేటెస్ట్ ఆఫర్, అద్భుతమైన కూపన్లు అంటూ రోజుకో ఆన్ లైన్ పథకంతో ఆన్ లైన్ సంస్థలు వినియోగదారులను ఆకర్షణీయమైన ఆఫర్లతో నిలువునా ముంచుతున్నాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన సృచరణ్ ప్రముఖ ఈ-టైలింగ్ సైట్ లో మెగా సేల్ ఆఫర్ లో ఆసుస్ వెస్ ఫైవ్ ఫోన్ ఆర్డర్ చేశాడు. దీనికి మే 26న క్రెడిట్ కార్డు ద్వారా 8099 రూపాయలు చెల్లించాడు. ఇందుకు సంబంధించిన పార్శిల్ ఈ నెల 8న అతని చేతికి వచ్చింది. కొరియర్ బాయ్ తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూసి అతను షాక్ తిన్నాడు. ఫోన్ ఉండాల్సిన ఆ బాక్స్ లో రెండు మామిడిపళ్లు దర్శనమిచ్చాయి. కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే వారు సరైన సమాధానం చెప్పలేదు. విచారణ జరుపుతామంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు తెలిపాడు.