: "నేనింకా కుర్రాడినే" అంటున్న లాలూ


ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (68) జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "నేనింకా కుర్రాడినే" అని హుషారుగా చెప్పారు. కిందటేడాది గుండెకు శస్త్రచికిత్స జరిగినా నవయువకుడిలా బలంగా ఉన్నానని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ధీమాగా చెప్పారు. ఎన్నికల వేళ బీజేపీని, మోదీని సమస్యల్లోకి నెట్టేస్తానని అన్నారు. బీహార్ లో అధికారంలోకి రాకుండా బీజేపీని అడ్డుకునేందుకు ఆర్జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడ్డాయని, సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ ను ప్రతిపాదించానని లాలూ వివరించారు. దేశం యావత్తూ తమను, బీహార్ ను గమనిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News