: ఐఎస్ఐఎస్ దగ్గర తొలి అణుబాంబు సిద్ధమైనట్టే!
ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తొలి అణుబాంబును తయారు చేసేందుకు అవసరమైనంత రేడియో యాక్టివ్ పదార్థాలను సంపాదించుకున్నారు. ప్రభుత్వ అణు కేంద్రాలపై దాడులు చేసి 'డర్టీ' బాంబుకు కావాల్సినంత అణు పదార్థాలు కూడగట్టుకున్నారని ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మారణహోమం సృష్టించే ఆయుధాలను తయారు చేయాలన్న తన లక్ష్యాన్ని, ప్రణాళికలను ఐఎస్ఐఎస్ తన సొంత పత్రిక 'డబీక్' ద్వారా తెలిపింది. కాగా, ఐఎస్ దళాలు పాకిస్థాన్ పై అణు బాంబులు వేయవచ్చని భారత అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.