: బెంజికార్ల తయారీ ఇండియాలోనే... రూ. 2.5 లక్షల వరకూ తగ్గనున్న ధర


నానాటికీ పెరుగుతున్న అమ్మకాల నేపథ్యంలో స్టట్ గార్డ్ కేంద్రంగా లగ్జరీ కార్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్న సంస్థ మెర్సిడిస్ బెంజ్ ఇండియాలో రెండో ఉత్పత్తి ప్లాంటును ఆరంభించింది. సాలీనా 20 వేల కార్ల తయారీ లక్ష్యంగా చక్కన్ లో ఈ ప్లాంటును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎబర్ హార్డ్ కెర్న్ ప్రారంభించారు. ఈ కేంద్రంలో కాంపాక్ట్ ఎస్ యూవీ 'జీఎల్ఏ'ను తయారు చేయనున్నామని తెలిపారు. ఇండియాలోనే కారు తయారు కానుండడంతో దిగుమతి సుంకాల భారం తగ్గిపోగా, ఆ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని నిర్ణయించామని, ఈ కారు ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకూ తగ్గుతుందని వివరించారు. కారు కొత్త ధర రూ. 31.31 లక్షల నుంచి (ఎక్స్ షోరూం, పుణె) ప్రారంభమవుతుందని తెలిపారు. 2014లో దేశవ్యాప్తంగా 10,200 యూనిట్ల ఎస్ యూవీలను డెలివరీ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కొత్తగా 15 డీలర్ షిప్ కేంద్రాలను ప్రారంభించామని, దీంతో ఇండియాలో డీలర్ షిప్ ల సంఖ్య 80కి పెరిగిందని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని మోడల్స్ ఇండియాలోనే తయారు చేసే ప్రణాళికల్లో ఉన్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News