: ఒక్క బంతీ పడకుండానే ఈ రోజు ఆటకు మంగళం!
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్, రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే నిలిచిపోయింది. ఈ ఉదయం మ్యాచ్ ప్రారంభం కావాల్సి వుండగా, వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆటను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. వర్షం పడకుంటే, మూడవ రోజు ఆట తిరిగి రేపు ఉదయం 9:30 కు మొదలు కానుంది. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్లలో శిఖర్ ధావన్ 150 పరుగులతో, మురళీ విజయ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నారు.