: ఈసారి ఏ పంటలేద్దాం... పామ్ హౌస్ లో కేసీఆర్ సమాలోచనలు!


మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవలిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ ఫామ్ హౌస్ ఉందిగా! అందులో ఆధునిక పద్ధతులతో చేసిన సాగుతో ఎకరాకు కోటి రూపాలయ మేర ఆదాయం సాధించానని గతంలో కేసీఆర్ చెప్పిన సంగతీ గుర్తుందిగా. తాజాగా ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఫామ్ హౌస్ లో ఈ ఏడాది ఏఏ పంటలను సాగు చేయాలన్న అంశంపై కేసీఆర్ దృష్టి సారించారు. మొన్న రాత్రి తన ఫామ్ హౌస్ చేరుకున్న కేసీఆర్ నిన్న ఉదయం అక్కడి సాగును పర్యవేక్షిస్తున్న జహంగీర్ అనే వ్యక్తితో సుదీర్ఘంగా చర్చించారట. ఈ సందర్భంగా జహంగీర్ తో కలిసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కలియదిరిగారు. ఎట్టకేలకు కొన్ని పంటలను ఎంపిక చేసిన కేసీఆర్, వాటి సాగు కోసం చర్యలు చేపట్టాలని జహంగీర్ కు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. అయితే కేసీఆర్ ఎంపిక చేసిన పంటల వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News