: ఉద్యోగులు మెచ్చిన సీఈఓగా ఇన్ఫోసిస్ చీఫ్ శిక్కా
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ శిక్కా హైయస్ట్ రేటెడ్ సీఈఓగా ఎంపికయ్యారు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న, చేసిన ఉద్యోగులతో 'గ్లాస్ డోర్' సంస్థ సర్వేను నిర్వహించి టాప్ రేటెడ్ చీఫ్ ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 50 మంది పేర్లను ఈ జాబితాలో ప్రచురించగా, భారత సంతతి వ్యక్తుల్లో శిక్కా తొలి స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచారు. గూగుల్ సీఈఓ లారీ పేజ్ తొలి స్థానంలో నిలిచారు. కాగా, తనకు ఇంతటి ఘనమైన గుర్తింపు రావడం పట్ల శిక్కా తన ట్విట్టర్ ఖాతాలో కృతజ్ఞతలు తెలిపారు. "గత రాత్రి గ్లాస్ డోర్ల మధ్య కూర్చొని ఉన్న సమయంలో ఈ విషయం తెలుసుకుని చాలా ఆనందపడ్డాను. థ్యాంక్స్ టూ ఇన్ఫోసియన్స్" అని ఆయన పేర్కొన్నారు.