: కన్నీరు పెట్టిన తనయ... ఊరడించి ఎన్ కన్వెన్షన్ కు తీసుకెళ్లిన రేవంత్
ఈ ఉదయం బెయిలుపై విడుదలైన రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బంధు మిత్రులు వెంటరాగా కుమార్తె నిశ్చితార్థం నిమిత్తం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాలుకు బయలుదేరారు. అంతకుముందు ఆయన్ను చూసి కుమార్తె నైమిశ బోరున విలపించారు. "ఏం కాదులేమ్మా" అంటూ, కుమార్తెను ఓదార్చిన రేవంత్, తనదైన శైలిలో అందరినీ హడావుడి పెట్టి నిశ్చితార్థ వేడుకకు సిద్ధం చేశారు. భారీ కాన్వాయ్ లో రేవంత్ కుటుంబం బయలుదేరగా, అప్పటికే ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న కొందరు తెలుగుదేశం నేతలు అక్కడి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రేవంత్ కుమార్తె నైమిశ రెడ్డి నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రేవంత్ అల్లుడు సత్యనారాయణరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడట.