: అదృష్టం పట్టుకుంటే అంతే... పెయింటర్ ను వందల కోట్లకు అధిపతిని చేసిన ఫేస్ బుక్!
అదృష్టం పట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అందుకే ఓ సాదాసీదా పెయింటర్ నేడు వందల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. అసలు విషయం ఏంటంటే, న్యూయార్క్ లో ఫేస్ బుక్ ఇన్ కార్పొరేషన్ సంస్థ ప్రారంభించిన కొత్తలో భవనానికి రంగులు వేసే బాధ్యతను డేవిడ్ చో అనే వ్యక్తికి అప్పగించారు. రంగులు వేసేందుకు 60 వేల డాలర్లు ఇవ్వాలని డేవిడ్ కోరగా, తమది చిన్న సంస్థని, అంత ఇచ్చుకోలేమని చెబుతూ, ఆ మొత్తానికి విలువైన వాటాలను ఇస్తామని చెప్పారు. అందుకు అంగీకరించిన డేవిడ్ అప్పట్లో ఆ వాటాలు తీసుకున్నాడు. పదేళ్లు తిరిగే సరికి ఫేస్ బుక్ సంస్థ ఆకాశమంత ఎత్తునకు ఎదిగింది. డేవిడ్ వద్ద ఉన్న వాటాల విలువ ఇప్పుడు ఏకంగా 20 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,270 కోట్లు) పెరగడంతో డేవిడ్ ఆనందానికి అంతులేకుండా పోయింది.