: రేవంత్ నాకు ఆత్మీయుడు... నేనెందుకు ఇరికిస్తాను?: ఎర్రబెల్లి ఆవేదన!
ఓటుకు నోటు కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఇరికించారన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై నిన్న వరంగల్ లో ఎర్రబెల్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆత్మీయుడైన రేవంత్ ను తానెందుకు ఇరికిస్తానని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి... ఆ ఆరోపణలన్నీ ఎవరో గొట్టంగాళ్లు, లొట్టంగాళ్లు పుట్టిస్తున్న పుకార్లేనని కొట్టిపారేశారు. రేవంత్ తన కుటుంబసభ్యుడి లాంటి వాడని, అలాంటిది తానెందుకు రేవంత్ ను ఇరికిస్తానని ఎర్రబెల్లి మీడియాను ఎదురు ప్రశ్నించారు.