: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయసు సడలింపునిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు పెద్దఎత్తున లబ్ధి చేకూరనుంది. నేడు జరిగిన కేబినెట్ భేటీలో కొత్త పారిశ్రామిక విధానానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతినివ్వాలని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలోని రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటు చేయాలని, టీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఈ నియామకాల్లో నిరుద్యోగులకు పదేళ్ల వయసు సడలింపు కల్పించాలని నిర్ణయించారు.