: భారత్ సాయం కోరుతున్న నేపాల్ క్రికెట్ కోచ్


నేపాల్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పుబుదు దసనాయకే భారత క్రికెట్ బోర్డు సాయం కోరుతున్నారు. గతంలో శ్రీలంక క్రికెట్ కు ఊతమిచ్చిన విధంగానే బీసీసీఐ ఇప్పుడు నేపాల్ క్రికెట్ కు చేయూతనందించాలని అన్నారు. 80వ దశకం ఆరంభంలో శ్రీలంక అంతర్జాతీయంగా ఎదిగేందుకు బీసీసీఐ ఎంతో తోడ్పాటు అందించిందని ఈ లంక మాజీ క్రికెటర్ తెలిపారు. అప్పట్లో తమ జట్టు భారత్ దేశవాళీ క్రికెట్లో రెగ్యులర్ గా దులీప్ ట్రోఫీ మ్యాచ్ లు ఆడేదని గుర్తుచేసుకున్నారు. ఆ అనుభవం శ్రీలంక క్రికెట్ కు విశేషంగా ఉపకరించిందని అన్నారు. ఇప్పుడు లంక ప్రపంచంలో అగ్రశ్రేణి జట్లలో ఒకటని పేర్కొన్నారు. అదే తరహాలో పొరుగుదేశం నేపాల్ కు సాయపడాలని బీసీసీఐని కోరారు. దసనాయకే లంక క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.

  • Loading...

More Telugu News