: ప్రధాని హామీ ఇచ్చారు: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. వరుసబెట్టి కేంద్ర ప్రముఖులను కలుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఓ తెలుగు వార్తా చానల్ ప్రతినిధితో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలపై ప్రధానితో మాట్లాడానని తెలిపారు. సెక్షన్-8 అమలు, గవర్నర్ పూర్తిస్థాయిలో అధికారాలు ఉపయోగించేలా చూడడం వంటి అంశాలను ఆయనతో చర్చించానని చెప్పారు. వీటిపై లోతుగా పరిశీలించిన పిదప నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని బాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News