: సల్మాన్ ఖాన్ మా నాన్నకు స్నేహితుడు...నాకు కాదు: వర్ధమాన నటి టీనా అహూజా
సల్మాన్ ఖాన్ తన తండ్రికి స్నేహితుడని, తనకు కాదని ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా కుమార్తె టీనా అహూజా పేర్కొంది. గతేడాది జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ తో కలిసి టీనా హాజరైంది. దీనిని చూసిన బాలీవుడ్ జనాలు, టీనాను సల్లూభాయ్ బాలీవుడ్ కు పరిచయం చేయనున్నాడని చెవులు కొరుక్కున్నారు. తన కుమార్తెను బాలీవుడ్ కు పరిచయం చేయాలని సల్లూభాయ్ ని గోవిందా అడిగాడని, దానికి సల్మాన్ అంగీకరించాడని వార్తా కధనాలు వెలువడ్డాయి. దీనిపై చాలా కాలానికి టీనా స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తలు పుకార్లని, వాస్తవాలు కాదని స్పష్టం చేసింది. కాగా, టీనా అహూజా 'సెకెండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఈ సినిమా జూలై 3న విడుదల కానుంది.