: కేంద్ర మంత్రి అన్నీ తెలుసుకుని మాట్లాడాలి: కేకే
ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొనడంపై టీఆర్ఎస్ నేత కె.కేశవరావు మండిపడ్డారు. స్టింగ్ ఆపరేషన్, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేకే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అన్నీ తెలుసుకుని మాట్లాడితే బావుంటుందని హితవు పలికారు. ముడుపుల వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందని స్పష్టం చేశారు. కేంద్రం చంద్రబాబుకు అండగా ఉంటుందనుకోవడం లేదని తెలిపారు.