: సద్గురు శివానంద మూర్తి మరణం బాధాకరం: మోదీ
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానంద మూర్తి (87) మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు."శివానంద మూర్తి తన సేవ, బోధనల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేశారు. ఆయన మృతి చెందడం విచారకరం. ఆయన అనుచరులందరికీ నా సంతాపం తెలియజేస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు.