: సీఎం ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్, డీజీపీ ఫిర్యాదు
ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్ ను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వారు గోయల్ కు ఫిర్యాదు చేశారు. అటు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన మరికొందరు కేంద్ర ప్రముఖులను కలిసే అవకాశం ఉంది. ఓటుకు నోటు వ్యవహారమే బాబు హస్తిన పర్యటన ప్రధాన అజెండా అని అర్థమవుతోంది.