: ప్రాణాంతక వ్యాధిని కూడా కామెడీ చేశాడు


ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిస్తే ఎంతటి ధైర్యవంతుడైనా నీరుగారిపోవడం సర్వసాధారణం. అలాంటిది తలకు పెద్ద ఆపరేషన్ జరిగితే దానిని కూడా కామెడీ చేసి ఆత్మస్థైర్యాన్ని చాటుకున్నాడో యువకుడు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి 'మెడుల్లా బ్లాస్టోమా' అనే వ్యాధి సోకింది. దీనిని బ్రెయిన్ కేన్సర్ గా భావిస్తారు. దీంతో అతని తలకు ఆపరేషన్ చేసి మెదడులో ఉన్న కణితి తొలగించారు. ఆపరేషన్ లో కుట్లు వేయడానికి బదులుగా పిన్నులు వాడారు. దీంతో అది చూసేందుకు అచ్చం కోటు జిప్ లాగా కనపడింది. దీంతో ఆ తుంటరి యువకుడు జీన్ ప్యాంటుకు వేసే జిప్ ను గాయం చివర అంటించి, జిప్ లాగా తయారు చేసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బ్రెయిన్ సర్జరీ అయిందని, పిన్నులను వైద్యులు తొలగించనున్నారని, అందుకే జిప్ తీసేస్తున్నారంటూ పోస్టు చేశానని పేర్కొన్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతనికి కొందరు శుభాకాంక్షలు చెబితే, మరి కొందరు అతని ఆత్మస్థైర్యాన్ని కొనియాడారు.

  • Loading...

More Telugu News