: ధావన్ సెంచరీ, భారీ స్కోరు దిశగా భారత్


బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తనదైన శైలిలో విజృంభించి సెంచరీ సాధించాడు. 101 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో ధావన్ 102 పరుగులు చేశాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ మురళీ విజయ్ సైతం అర్ధసెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత ఆటగాళ్లపై బంగ్లా బౌలర్లు ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయారు. మురళీ విజయ్ 110 బంతులను ఎదుర్కొని 63 పరుగులు చేశాడు. భోజన విరామానికి ముందు వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలకు పైగా ఆగిపోయింది. ప్రస్తుతం భారత స్కోరు 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు.

  • Loading...

More Telugu News