: రేవంత్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ మంజూరు


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు వ్యవహారంలో బెయిల్ లభించింది. ఆయన బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు, రేవంత్ బెయిల్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయవాది సురేందర్ రావు కూడా సానుకూలంగానే స్పందించారు. ఒక రోజు బెయిల్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రేపు రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయస్థానం ఆయనకు పలు షరతులు విధించింది. కుమార్తె నిశ్చితార్థంలో మాత్రమే పాల్గొనాలని, ఎవరితో భేటీలు కారాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. మీడియాను, రాజకీయ నేతలను కలవరాదని, ఫోన్లలో మాట్లాడకూడదని పేర్కొంది. రేపు ఉదయం 5.30 గంటలకు రేవంత్ ను విడుదల చేయాలని చర్లపల్లి జైలుకు అధికారులను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News