: కాళ్లు పట్టుకోవడానికి మీరెళ్లి, జగన్ ను నిందించడమెందుకు?: వాసిరెడ్డి పద్మ


ఓటుకు నోటు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి, అందులోంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం వద్దకు వెళితే, ఆయన అనుచరులు జగన్ ను ఎందుకు నిందిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తప్పు చేసింది టీడీపీ నేత, కేంద్రం కాళ్లు పట్టుకోవడానికి వెళ్లింది పార్టీ అధినేత అయితే వారిద్దరినీ నిందించడం మానేసి, జగన్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో పక్క రాష్ట్రాల్లోని అవినీతికి పాల్పడిన బాబు, ఏపీ ప్రజల పరువు తీశారని విమర్శించారు. ఏపీ మంత్రులు చెబుతున్నట్టు చంద్రబాబు నీతిమంతుడైతే తక్షణం పదవికి రాజీనామా చేసి, న్యాయవిచారణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ, ప్రజల గౌరవమర్యాదలను బాబు మంటగలుపుతున్నారని ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News