: ఆప్ మంత్రికో న్యాయం, చంద్రబాబుకో న్యాయమా?: కేంద్రంపై వీహెచ్ ధ్వజం


ఓటుకు నోటు వ్యవహారంలో కేంద్రం స్పందించాలంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి తప్పు చేశారని జైలుకు పంపిన కేంద్రం, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారంలో ఎందుకు ఉపేక్షిస్తోందని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. చట్టం ముందు సీఎం అయినా, మరెవరైనా ఒక్కటేనని స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పు చేయలేదని భావిస్తే... తాను స్టీఫెన్ సన్ తో మాట్లాడలేదని, రేవంత్ ను తాను పంపలేదని ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News