: అవన్నీ పుకార్లే... నేను బతికే ఉన్నా: టాలీవుడ్ యువ దర్శకుడు విప్లవ్


టాలీవుడ్ యువ దర్శకుడు కోనేటి విప్లవ్ (33) చనిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలిపోయింది. తన మృతిపై వచ్చిన వదంతులపై విప్లవ్ స్పందించాడు. హెల్త్ బాగా లేకపోవడంతో మొబైల్ స్విచాఫ్ చేశానని, దాంతో, చనిపోయానని పుకార్లు వ్యాపించాయని అన్నాడు. తాను బతికే ఉన్నానని ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించాడు. వైద్య విద్య అభ్యసించిన విప్లవ్ ఆ తర్వాత సినిమా రంగంలో ప్రవేశించాడు. ప్రస్తుతం జగపతిబాబు కథానాయకుడిగా 'హితుడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అంతకుముందు, విప్లవ్ మరణించాడన్న వార్తల నేపథ్యంలో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News