: బెజవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి రాకెట్... గుట్టును రట్టు చేసిన పోలీసులు


విజయవాడ కేంద్రంగా నకిలీ నెయ్యి తయారీ ముఠా గుట్టు రట్టైంది. పలు రకాల వ్యర్ధాలతో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న ‘శశి ఘీ’ కంపెనీ, సదరు నెయ్యిని ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేరిట విక్రయిస్తోెంది. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న నెయ్యి బ్రాండ్లు దుర్గ, విష్ణు, వైష్ణవి, మహాలక్ష్మి, చిన్నికృష్ణ తదితర బ్రాండ్ల పేరిట ప్యాకెట్లను తయారు చేస్తున్న శశి ఘీ కంపెనీ వాటిలో కల్తీ నెయ్యిని నింపేసి విక్రయిస్తోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నేడు విజయవాడలో విస్తృత దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో శశి ఘీ కంపెనీ తయారు చేసిన కల్తీ నెయ్యి భారీ నిల్వలు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు కూడా ఇదే కల్తీ నెయ్యి సరఫరా అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News