: ఇకపై తత్కాల్ టికెట్లు క్యాన్సిల్ చేసినా రిఫండ్... మారిన బుకింగ్ సమయాలు


ప్రయాణ అవసరాల నిమిత్తం తత్కాల్ విధానంలో కొనుగోలు చేసే రైలు టికెట్ ను క్యాన్సిల్ చేస్తే ఏ విధమైన టికెట్ ధరా తిరిగి రాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. తత్కాల్ టికెట్లను బుక్ చేసి ఆపై క్యాన్సిల్ చేసుకుంటే చెల్లించిన ధరలో 50 శాతం తిరిగి వెనక్కివ్వాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై అతిత్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడవచ్చని రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయాలను మారుస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ఏసీ క్లాసుల్లో తత్కాల్ ప్రయాణానికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ, నాన్ ఏసీ ప్రయాణానికి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ రైల్వే కౌంటర్లు ప్రత్యేకంగా పనిచేస్తాయని వివరించింది. కొన్ని బిజీ రూట్లలో తత్కాల్ చార్జీలపై ప్రత్యేక రైళ్లను నడపాలని కూడా రైల్వేలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News