: ప్రైవేట్ వ్యక్తులతో కలిసి టీ ఏసీబీ కుట్ర చేసింది: ఓటుకు నోటుపై అచ్చెన్నాయుడు ఫైర్
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై కుట్ర పన్నిన తెలంగాణ సీఎం కేసీఆర్ తన రాష్ట్ర ఏసీబీని పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీ సచివాలయం నుంచి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, ఓటుకు నోటులో జరిగిన కుట్ర కోణాన్ని సోదాహరణంగా విపులీకరించారు. ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో తెలంగాణ ఏసీబీ అధికారులు కుట్రపూరితంగా ఆడియో టేపులను సృష్టించారని ఆయన ఆరోపించారు. ఆడియో టేపుల్లో చంద్రబాబు వాయిస్ ను ఫోర్జరీ చేశారన్నారు. ఇక ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తెలంగాణ సర్కారు చేస్తున్న యత్నాలకు ఏపీకి బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకరిస్తుండటం బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.