: 28న ఫిర్యాదు అందితే...31న కేసు నమోదైతే కుట్ర ఉన్నట్టేగా?: కోర్టులో రేవంత్ లాయర్ల వాదన


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో ఆసక్తికర వాదన జరిగింది. ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ గత నెల 28న ఫిర్యాదు చేస్తే, 31న కేసు నమోదు చేశామని ఏసీబీ చెప్పిన మాట తెలిసిందే. అయితే ఫిర్యాదు అందిన నాటి నుంచే మూడు రోజుల పాటు ఆడియో, వీడియో రికార్డింగ్ ఎందుకు చేశారని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. కేసు నమోదు చేయకుండా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడం చట్టవిరుద్ధమని కూడా వారు తేల్చిచెప్పారు. కేసు నమోదు చేయకుండానే దర్యాప్తు ఎలా చేస్తారని కూడా వారు ప్రశ్నించారు. ఇలా 28న అందిన ఫిర్యాదుపై 31న కేసు నమోదు చేశామని చెబుతున్న ఏసీబీ వాదనలో కుట్ర కోణం దాగి ఉందన్న విషయం తేటతెల్లమవుతుందని రేవంత్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News