: మధ్యంతర బెయిలుకు అభ్యంతరం లేదు: రేవంత్ కేసులో కోర్టుకు చెప్పిన ఏసీబీ
రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం నిమిత్తం ఆయనకు మధ్యంతర బెయిలు ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు అధికారులు తెలిపారు. అయితే, ఏ విధమైన సమావేశాలు పెట్టరాదని షరతు విధించాలని అధికారులు కోరారు. ఈ ఉదయం కోర్టులో రేవంత్ తరపు న్యాయవాదులు, తమ క్లయింటు కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు బెయిలివ్వాలని కోరారు. దీనిపై ఏసీబీ అధికారుల అభ్యంతరాలను న్యాయమూర్తి కోరగా, ఆయన సాక్ష్యులను భయపెట్టరాదని, నేటి సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకూ మధ్యంతర బెయిలు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో మరికాసేపట్లో రేవంత్ కు బెయిలు లభిస్తుందని సమాచారం.