: చర్లపల్లి జైలులో రేవంత్ ను కలసిన కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి
చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు. కేవలం పరామర్శించేందుకే రేవంత్ ను ఆయన కలసినట్టు సమాచారం. మరోవైపు రేవంత్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అటు దానిపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే రేవంత్ కు బెయిల్ వస్తుందా? రాదా? అన్న ఉత్కంఠ నెలకొంది.