: నెల్లూరులో స్ట్రీట్ ఫైట్... పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో యువకుల వీరంగం
అది నెల్లూరు పట్టణంలోని కనక మహల్ సెంటర్. నిన్న మధ్యాహ్నం, నడి రోడ్డుపై ఓ స్ట్రీట్ ఫైట్ జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇద్దరు యువకులు కత్తులతో హల్ చల్ చేశారు. ఓ యువకుడు మరో యువకుడిపై కత్తులతో దాడికి దిగాడు. మద్యం మత్తు తలకెక్కిన ఆ యువకుల మధ్య వివాదానికి కారణం తెలియనప్పటికీ, కత్తులతో రోడ్డుపైకి రావడంతో స్థానికులు పరుగులు పెట్టారు. ప్రత్యర్థిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కింద పడేసి, అతడి మీద కూర్చుని కత్తితో దాడికి యత్నించాడు యువకుడు. ఆ తర్వాత యువకులు ఎవరిదారిన వారు పోయారు గానీ, సదరు స్ట్రీట్ ఫైట్ దృశ్యాలు మాత్రం మీడియాకు చిక్కాయి. ఈ వీడియోల ఆధారంగా నెల్లూరు పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా యువకులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.