: కెమికల్ ఫ్యాక్టరీలో లీకైన విష వాయువులు... ముగ్గురు కార్మికులు దుర్మరణం
నల్లగొండ జిల్లాలో నేటి తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్న జయల్యాబ్ కెమికల్ ఫ్యాక్టరీలో విష వాయువులు లీకయ్యాయి. ఈ వాయువులను పీల్చిన ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని అనారోగ్యానికి గురైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విష వాయువులు లీకైన వైనంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జయల్యాబ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.