: ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఏపీ కేబినెట్ ఫైర్...ఘాటుగానే సమాధానమిచ్చిన పోలీసు అధికారి


ఓటుకు నోటు వ్యవహారంలో ఏకంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ కు గురవుతున్నా గుర్తించడంలో విఫలమయ్యారంటూ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏఆర్ అనురాధపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరగిన అత్యవసర కేబినెట్ భేటీకి డీజీపీ జేవీ రాముడితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏఆర్ అనురాధను కూడా పిలిచారు. సమావేశంలో భాగంగా మంత్రులందరి ముందే అనురాధను చంద్రబాబు నిలదీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థిక శాఖ మంత్రి యనమల, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు కూడా అనురాధపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కాస్త మనసు నొచ్చుకున్న అనురాధ కూడా మంత్రుల ప్రశ్నలకు ఘాటుగానే సమాధానమిచ్చారు. ఏపీ అధికారిగా ఉంటూ తెలంగాణ మంత్రులు, అధికారుల ఫోన్లపై నిఘా పెడితే తమ పరిస్థితేం కావాలని కూడా ఆమె ఎదురు ప్రశ్నించారు. అంతేకాక సమావేశం ముగియకుండానే ఆమె అక్కడి నుంచి నిష్క్రమించారట. సమావేశం నుంచి బయటకు వచ్చిన అనురాధ అధికారిక వాహనాన్ని అక్కడే వదిలేసి, వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారట. పోలీసు అధికారి ఘాటు స్పందనతో షాక్ తిన్న చంద్రబాబు, మిగతా మంత్రులు తక్షణమే అనురాధను ఆ పోస్టు నుంచి తొలగించి, వేరేవారికి బాధ్యతలు అప్పగించాలని తీర్మానించారు. అయితే ఉన్నపళంగా అనురాధను బదిలీ చేస్తే, తెలంగాణ ప్రభుత్వ ఆరోపణలు వాస్తవమని ఒప్పుకున్నట్లవుతుందని సర్దిచెప్పిన కొంతమంది మంత్రులు చంద్రబాబును శాంతపరిచారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News