: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానందమూర్తి కన్నుమూత


ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త సద్గురు శివానందమూర్తి (87) కన్నుమూశారు. వరంగల్ లోని గురుధామ్ లో నేటి తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఎండవేడిమికి గురైన శివానందమూర్తి నెల రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 30న శివానందమూర్తికి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన కుమారుడితో చాలాసేపు మాట్లాడిన మోదీ, శివానందమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడెమీని స్థాపించిన శివానందమూర్తి కళాకారులకు మెరుగైన సేవలందిస్తున్నారు. వరంగల్ లో గురుధామ్ తో పాటు విశాఖలోని భీమిలిలో ఆనందవనం పేరిట ఆశ్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. 1928 డిసెంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన కందుకూరి శివానందమూర్తి సేవలను గుర్తించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేసింది.

  • Loading...

More Telugu News