: తెలంగాణలో ఆలయానికి ఆరువేలు పెంపు!
తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో ధూప దీప నైవేద్యం నిధుల మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నెలకు 6 వేల రూపాయలు కేటాయించినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. పూజారుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం నిధులు పెంచుతామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా, 2500 రూపాయలుగా ఉన్న నిధులను 6 వేల రూపాయలకు పెంచుతూ జీవో జారీ చేసింది. దీని పట్ల పూజారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.