: నా సినిమాలో పాట విని అమ్మ ఏడ్చింది: వరుణ్ ధావన్


తన తాజా సినిమా 'ఏబీసీడీ2'లో భావోద్వేగంతో కూడిన పాటను విని తన తల్లి కన్నీరుపెట్టుకుందని బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ చెప్పాడు. సినిమా ఆడియో వేడుకకు ముందే 'మా కీ చునార్' అంటూ సాగే పాటను తన తల్లికి అంకితమిస్తున్నట్టుగా పేర్కొన్న వరుణ్ ధావన్, ముందుగా తల్లికి వినిపించాడట. పాటవిన్న ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. ఈ పాట చిత్రీకరణ సమయంలో తన అమ్మమ్మ మరణించినట్టు వరుణ్ తెలిపాడు. సినిమాలో పాటలన్నీ డాన్స్ ప్రధానంగా సాగుతాయని, ఈ పాట మాత్రం భావోద్వేగంతో సాగుతుందని వరుణ్ వెల్లడించాడు. కాగా ఈ సినిమాకు రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తుండగా, ప్రభుదేవా ప్రత్యేకపాత్రలో నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News