: చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఏకే ఖాన్ స్పందన


ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ స్పందించారు. దీనిపై వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమని అన్నారు. ఏసీబీ ఏ కేసునైనా చట్టబద్ధంగానే దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేశారు. కాగా, కేసీఆర్ తో సమావేశంలో ఏకే ఖాన్ తో పాటు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఓటుకు నోటు కేసు గురించి, చంద్రబాబు ఆడియో టేపుల గురించి చర్చించినట్టు తెలిసింది. చంద్రబాబుపై కేసు నమోదుకు కేసీఆర్ ఓకే చెప్పినట్టు సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News