: స్టార్ హోదా చూపని హాలీవుడ్ స్టార్ దంపతులు


'టీవీలో కనిపిస్తేనే సెలబ్రిటీలము, మా స్థాయి ఇంత' అంటూ డాబూ దర్పం వెలగబెట్టే చాలా మంది గురించి వింటూ ఉంటాం. వారికి భిన్నంగా హాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ దంపతులు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ ఎలాంటి డాబూ దర్పం ప్రదర్శించకుండా, సాధారణ ప్రయాణికుల్లా విమానంలో ప్రయాణించి (వారికి ప్రత్యేకంగా ఓ విమానం ఉంది) ప్రత్యేకతను చాటుకున్నారు. ఆరుగురు పిల్లలతో కలిసి లాస్ ఏంజిలెస్ నుంచి పారిస్ వచ్చిన ఈ దంపతులు అక్కడి చార్ల్స్ డిగాల్ ఎయిర్ పోర్టులో నీస్ వెళ్లే విమానం కోసం అందరు ప్రయాణికులతో రెండు గంటల పాటు ఎదురుచూశారు. అంత సేపూ అక్కడ సందడే...సెలబ్రిటీ జంటను చూస్తూ వారితో ముచ్చట్లు పెట్టారు ప్రయాణికులు. ఇంతలో విమానం వచ్చింది. వీరు బిజినెస్ క్లాస్ లో కూర్చుంటారని అంతా భావించారు. అందుకు భిన్నంగా వారు ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. ఆరుగురు పిల్లలను జాగ్రత్తగా ఎక్కించిన పిట్, లగేజ్ సర్దుతూ అందర్నీ పలకరిస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో ఎకానమీ క్లాస్ ప్రయాణికులు మొత్తం ఆనందంలో మునిగిపోయారు. పిట్, జోలీ దంపతులు, వారి పిల్లలతో ఫోటోలు దిగి, వారి సింప్లిసిటీని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఇవి ఆదరణ పొందుతున్నాయి. కాగా, ఈ హాలీవుడ్ స్టార్ దంపతులు మిగిలిన అందరికంటే ప్రత్యేకం. ఎందుకంటే, వీరు స్టార్ స్టేటస్ కంటే మానవత్వం ముఖ్యం అని పలు సందర్భాల్లో నిరూపించారు. వీరి ఆరుగురు పిల్లలలో ముగ్గురు వివిధ దేశాల నుంచి దత్తత తీసుకున్నవారే కావడం విశేషం!

  • Loading...

More Telugu News