: బాబును విచారించేందుకు అనుమతులు అక్కర్లేదు: రామచంద్రయ్య
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత సీ.రామచంద్రయ్య చెప్పారు. హైదరాబాదులోని ఇందిరా భవన్ లో ఆయన మాట్లాడుతూ, ఓటుకు నోటు వ్యవహారంలో బాబు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాధారాలతో వెల్లడి అయిందని అన్నారు. అందువల్ల ఆయనను విచారించే అధికారం తెలంగాణ ఏసీబీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబును విచారించడానికి తెలంగాణ ఏసీబీకి గవర్నర్ అనుమతి అవసరం లేదని ఆయన వెల్లడించారు. అలాగే విభజన చట్టం ప్రకారం తనకున్న అధికారాలతో చంద్రబాబును విచారించమని గవర్నర్ కూడా ఆదేశించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బాబు వ్యవహారశైలి ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.