: తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయి: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, డబ్బుకు ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తూ అడ్డంగా బుక్కయ్యారని అన్నారు. చంద్రబాబునాయుడు సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఆ పార్టీ నుంచి బయటపడాలని ఆయన సూచించారు. చంద్రబాబు తీరే అంతని, అవినీతికి పాల్పడడం, ఎదురు దాడికి దిగడం ఆయనకు అలవాటని హరీష్ రావు విమర్శించారు. అడ్డంగా దొరికిపోయి ఫోన్ ట్యాప్ చేశారనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.