: మగధీర పాత్ర ముచ్చట తీర్చుకున్న రానా
తెలుగు సినీరంగంలో మగధీర లాంటి సినిమాలో నటించాలని భావించని నటుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. విఠలాచార్య సినిమాల తరువాత అద్భుతంగా ఆకట్టుకున్న సినిమా రాజమౌళి మగధీర. అందులో నటించే అవకాశం దక్కనప్పటికీ, టాలీవుడ్ యంగ్ హీరో రానా, రామ్ చరణ్ తో కలిసి డబ్ స్మాష్ ద్వారా మగధీర ముచ్చట తీర్చుకున్నాడు. 'వందమందిని పంపించు షేర్ ఖాన్' అంటూ అత్యంత ఆదరణ పొందిన డైలాగ్ ను రామ్ చరణ్ తో కలిసి డబ్ స్మాష్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో వీరిద్దరి మధ్యనున్న సాన్నిహిత్యాన్ని చూపుతుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే దీనికి పెద్ద సంఖ్యలో క్లిక్ లు వచ్చాయి.