: చంద్రబాబు రాజీనామా చేసి, లోకేష్ కో లేదా బాలకృష్ణకో సీఎం పదవి అప్పగించాలి: భూమా


చంద్రబాబుకు ఉచిత సలహా ఇస్తున్న వారి జాబితాలో వైకాపా నేత భూమా నాగిరెడ్డి కూడా చేరిపోయారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని... ఆ పదవిని తన కుమారుడు లోకేష్ కు గాని, లేదా తన బావమరిది బాలకృష్ణకు గాని అప్పగించాలని సూచించారు. నంద్యాలలో ఈ రోజు వైకాపా కార్యకర్తలతో కలసి ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ కూడా చంద్రబాబును అవినీతిపరుడు అని వ్యాఖ్యానించారని చెప్పారు.

  • Loading...

More Telugu News