: మద్యాన్ని నిషేధించకపోతే నదిలో దూకుతా... ఓ ఫ్రీడం ఫైటర్ హెచ్చరిక


మద్య నిషేధం విధించాలంటూ ఉత్తరప్రదేశ్ లో చిమ్మన్ లాల్ జైన్ (96) అనే స్వాతంత్ర్య సమరయోధుడు ఓ ఉద్యమం చేపట్టారు. రాష్ట్రంలో ఆయన ఉద్యమానికి మంచి స్పందన కనిపిస్తోంది. అయితే, ప్రభుత్వం వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడకపోవడంతో జైన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. అక్టోబరు 2 లోగా యూపీ సర్కారు మద్య నిషేధం ప్రకటించాలని, లేకపోతే తాను యమునా నదిలో దూకుతానని హెచ్చరించారు. ఆగ్రాకు చెందిన జైన్ ఇటీవలే తన వద్ద ఉన్న చరఖాను తాజ్ మున్సిపల్ మ్యూజియానికి ఇచ్చేశారు.

  • Loading...

More Telugu News