: హెచ్ఎస్ బీసీలో 50 వేల మంది ఉద్యోగాలు హుష్ కాకి!
పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు హెచ్ఎస్ బీసీ వెల్లడించింది. బ్రెజిల్, టర్కీ దేశాల నుంచి పూర్తిగా విరమించుకోనున్నామని, ప్రధాన కార్యాలయాన్ని లండన్ నుంచి తరలించనున్నామని సంస్థ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కి వెల్లడించిన స్టేట్ మెంటులో ప్రకటించింది. ఈ చర్యల ఫలితంగా వచ్చే రెండేళ్లలో 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆదా చేస్తామని అంచనా వేస్తున్నట్టు వివరించింది. బ్యాంకును ప్రారంభించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా తదుపరి దశ సాంకేతికను అందుకునే దిశగా అడుగులు పడుతున్నాయని, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గనుందని తెలిపింది.