: ఓటుకు నోటులో అనుబంధ ఎఫ్ఐఆర్?...20 మందిని నిందితులుగా చేర్చే అవకాశం!


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి సహా ఇద్దరు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహలను విచారిస్తూనే నేటి ఉదయం వారి ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసింది. తొలుత గంట పాటు సోదాలు చేసి వెళ్లిన ఏసీబీ అధికారులు, ఆ తర్వాత కేవలం గంటల వ్యవధిలో మరోమారు వారి ఇళ్లపై దాడులు చేశారు. రెండో దఫా దాడుల్లో రేవంత్ రెడ్డి ఇంటిలోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ తో పాటు పలు కీలక ఆధారాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఉదయ సింహ ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు అతడి తల్లిని వెంటబెట్టుకుని అతడి బ్యాంకు లాకర్లను తనిఖీ చేసేందుకు వెళ్లారు. నేటి ఉదయం నుంచి జరుగుతున్న వరుస దాడులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో అనుబంధ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసే దిశగా ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అడిషనల్ ఎఫ్ఐఆర్ లో 20 మంది నిందితుల పేర్లను చేర్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై నేటి సాయంత్రం లోగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News