: ఆ గొంతు మీదని తేలితే రాజీనామా చేస్తారా?: చంద్రబాబుకు జేపీ ప్రశ్న
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శలు గుప్పించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన జేపీ, చంద్రబాబు తీరుపై ఘాటు విమర్శలు చేశారు. ‘‘మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వడం నిజం కాదా? మీ అనుమతి లేకుండా అలాంటి పనికి రేవంత్ రెడ్డి పాల్పడితే, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పదిహేనేళ్లలో ఎన్నడూ లేని విధంగా దివంగత సీఎం ఎన్టీఆర్ ప్రస్తావన నిన్ననే ఎందుకు తీసుకున్నారు?’’ అంటూ చంద్రబాబును జేపీ నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపుల్లోని గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా? అని కూడా చంద్రబాబును జేపీ ప్రశ్నించారు.