: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన దాశరథి అంత్యక్రియలు
ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య అంత్యక్రియలు ముగిశాయి. ఆయన పార్థివ దేహానికి హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు దాశరథి నివాసం నుంచి శ్మశానవాటిక వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. ఈ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు దాశరథి గౌరవార్థం గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.