: నితీష్ నా చిన్న తమ్ముడు... బీజేపీ కిడ్నాప్ చేసింది: లాలూ
జనతాదళ్ (యునైటెడ్)నేత నితీష్ కుమార్ తనకు చిన్న తమ్ముడని, ఇంతకుముందు అతడిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. కమ్యూనలిజం పేరిట పడగ విప్పిన పామును అణచివేస్తామని అన్నారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, బీజేపీని తిరిగి పెవిలియన్ కు పంపుతామని హెచ్చరించారు. మతతత్వ పార్టీలను మట్టికరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ జనతా పరివార్ లో చేరితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. నితీష్ కుమార్ తో బంధం ఎంతో అవసరమని, తామంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని అన్నారు. టిక్కెట్ల పంపిణీ విషయంలో కొన్ని కొన్ని అవాంతరాలు ఎప్పుడూ వస్తుంటాయని, ఆ సమస్యను సులువుగా పరిష్కరించుకోగలమని అన్నారు. జనతా పరివార్ ను చూసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.