: తిరుమలలో నాటు సారా ప్యాకెట్ల కలకలం
వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలపై నాటు సారా ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. విజిలెన్స్ అధికారుల కళ్లుగప్పి ఓ వ్యక్తి నాటు సారా ప్యాకెట్లను తిరుమల కొండపైకి చేర్చాడు. కొండపై ఉన్న గంగమ్మ ఆలయం పరిసరాల్లో సదరు ప్యాకెట్లు విక్రయిస్తూ అతడు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు అతడి వద్ద నుంచి 15 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి పాదాల చెంత ఏర్పాటు చేసిన చెకింగ్ లో విజిలెన్స్ కళ్లుగప్పి సారా ప్యాకెట్లను కొండపైకి తీసుకుని వచ్చినట్లు అతడు అబ్కారీ శాఖ అధికారులకు వెల్లడించాడు. దీంతో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.