: ఇక గ్లూకాన్-డీ వంతు... ఎనర్జీ డ్రింక్ లో పురుగులు!


నెస్లే ఉత్పత్తి మ్యాగీ నూడిల్స్ లో హానికర రసాయనాలున్న అంశం దేశంలోనే కాక విదేశాల్లోనూ కలకలం రేపింది. ప్రస్తుతం దేశంలో మ్యాగీ నూడిల్స్ విక్రయాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పలు బహుళ జాతి సంస్థల ఉత్పత్తులపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది. తాజాగా ఎనర్జీ డ్రింక్ గ్లూకాన్-డీ లో చిన్న చిన్న పురుగులు కనిపించాయి. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఈ ఎనర్జీ డ్రింక్ ను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి, దానిని తాగి అస్వస్థతకు గురయ్యాడు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు అందులో పురుగులను గుర్తించినట్లు సమాచారం. వివరాల్లోకెళితే, బబ్లూ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ఓ జనరల్ స్టోర్ నుంచి గ్లూకాన్-డీ కొనుగోలు చేశాడు. దానిని తాగిన అతడి కుటుంబ సభ్యులకు వాంతులయ్యాయి. దీంతో సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు గ్లూకాన్-డీ ప్యాకెట్ ను ల్యాబ్ కు పంపి పరీక్షించిన అధికారులు అందులో పురుగులున్నట్లు తేల్చారు. అమెరికాకు చెందిన హేచ్ జే కంపెనీ గ్లూకాన్-డీని ఉత్పత్తి చేస్తోంది. ఈ ఉత్పత్తిలో పురుగులున్నట్లు తేలడంతో అధికారులు దీనిపై మరింత లోతుగా పరిశీలన జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News